లాక్ డౌన్ పొడిగింపు… తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాలు సుముఖత 

లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.

  • Publish Date - April 10, 2020 / 12:06 AM IST

లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.

ప్రపంచదేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా కలవర పెడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి. 

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో సంబంధం లేకుండా తమ రాష్ట్రాల్లో ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. కర్నాటక సీఎం యెడియూరప్ప లాక్ డౌన్ ను మరో 15 రోజులపాటు పొడిగించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి తదితర రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని అంటున్నాయి. దేశ ప్రజలను కాపాడుకోవాలంటే లాక్ డౌన్ ను పొడిగించడం కన్నా వేరే మార్గం లేదని రాజకీయ పార్టీలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులు చెబుతున్నారు. (ఏపీలో 363కు చేరిన కరోనా కేసులు…ఆరుగురి మృతి )

ఇప్పటివరకు లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడం వల్లే కరోనా మూడో దశకు వ్యాప్తి చెందకుండా అడ్డుకోలిగామని చెప్పారు. కేంద్రం చేపట్టిన చర్యల వల్ల దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్ లో ఉందన్నారు. వైరస్ ను పూర్తి స్థాయిలో అంతం చేయాలంటే ఏప్రిల్ 14 వరకు ఉన్న లాక్ డౌన్ ను మరింతకాలం పొడిగిస్తేనే మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ నేతల వీడియో కాన్ఫరెన్స్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు కేకే, నామా నాగేశ్వరరావు కూడా లాక్ డౌన్ పొడిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ భేటీలో పాల్గొన్నవారిలో 80 శాతం మంది నేతలు లాక్ డౌన్ ను పొడిగించాలని కోరారు. దేశంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు పీఎం మోడీ రాబోయే శనివారం అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలకు అనుగుణంగా లాక్ డౌన్ పొడిగింపుపై ప్రధాని నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.