పోలీసుల మరో యాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

యాప్‌లను హ్యాక్ చేసి అందులోని డేటాను కేటుగాళ్లు ఆన్ అమ్ముతున్నారు కేటుగాళ్లు.

తెలంగాణ పోలీసులకు చెందిన మరో యాప్‌ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఇటీవల తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు టీఎస్సీఓపీ యాప్‌ను సైతం హ్యాక్ చేశారు.

యాప్‌లను హ్యాక్ చేసి అందులోని డేటాను కేటుగాళ్లు ఆన్ అమ్ముతున్నారు కేటుగాళ్లు. 120 డాలర్లకు తెలంగాణ పోలీసుల డేటా ఇస్తామంంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ రెండు యాప్ లలో దాదాపు 12 లక్షల మందికి సంబంధించిన డేటా ఉన్నట్లు తెలుస్తోంది. వారి డేటానే బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు సైబర్ కేటగాళ్లు.

కాగా, జనాలకు సత్వరమే సేవలు అందించేందుకు తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్ హ్యాక్ ను రూపొందించిన విషయం తెలిసిందే. దీని వేదికగా చాలా మంది ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. ఇందులో చాలా మంది పౌరుల ఆధార్ కార్డులు, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. హ్యాకర్లను గుర్తించేందుకు పోలీసుులు ప్రయత్నిస్తున్నారు.

Also Read: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం