ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం

గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియామకం

Neerab Kumar Prasad: ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ నియమితుడయ్యారు. నీరబ్ కుమార్ నియామకంపై ఉత్తర్వులు వెలువడ్డాయి. 1987 బ్యాచ్‌కి చెందిన నీరబ్ కుమార్ గతంలో చంద్రబాబు హయాంలో కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పని చేస్తున్నారు.

ఏపీ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి నిన్న సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఆయన కొన్ని రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. నీరబ్ కుమార్ కూడా ఈ నెలాఖరేకే ప్రమాణ స్వీకారం చేస్తారు.

నిన్న చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డితో పాటు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిశారు. చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 12న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పాటు ముందు కీలక మార్పులు జరుగుతున్నాయి.

Also Read: తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు అయ్యేదెవరు.? ఆ 8మందిలో అవకాశం దక్కేది ఎవరికి?