మేరు ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. మేరు అంతరాగ్ని-2.. 2025 పేరుతో సస్టైనబిలిటీ థీమ్‌తో.. సేవ్ నేచర్ పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా మేరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ మేఘన గోరుకంటి జూపల్లి హాజరయ్యారు.
రకరకాలుగా మనుషుల చేతిలో ప్రకృతి ఎలా నాశనం అవుతుంది? మనుషులుగా మనం ప్రకృతిని ఎలా కాపాడాలి? వంటి విషయాలు తెలిపేలా ఆర్ట్స్ రూపంలో చూపించారు విద్యార్థులు. విద్యార్థులు తయారు చేసిన థీమ్స్ ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, వారికి ప్రకృతి పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యంగా సస్టైనబిలిటీ అంతరాగ్ని 2025 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు మేఘన గోరుకంటి జూపల్లి తెలిపారు. అంతరాగ్ని కార్యక్రమంలో చిన్నారులు వేసిన పెయింటింగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.