Green Channel: 36.8 కిలోమీటర్లు 29 నిమిషాల్లో వచ్చేశారు.

ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో అవయవ మార్పిడి శస్త్ర తరచుగా జరుగుతున్నాయి. రెండు నెలల క్రితం అపోలో ఆసుపత్రిలో గుండె మార్పిడి చికిత్స జరిగింది.

Green Channel: ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు తరచుగా జరుగుతున్నాయి.  రెండు నెలల క్రితం అపోలో ఆసుపత్రిలో గుండె మార్పిడి చికిత్స జరిగింది. దీనికోసం మెట్రో సేవలు ఉపయోగించుకున్నారు వైద్యులు. ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి జూబ్లీహాల్స్ అపోలో ఆసుపత్రికి 45 నిమిషాల్లో గుండెను తరలించారు. ఇక బుధవారం మరో వ్యక్తికీ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

ఇందుకోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వరకు పోలీసులు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ వరకు 36.8 కిలోమీటర్ల దూరం ఉండగా కేవలం 29 నిమిషాల్లో చేరుకున్నారు. గ్రీన్ చానెల్ కు సహకరించిన పోలీసులకు కిమ్స్ వైద్యులు, రోగి బంధువులు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే 12 సార్లు గ్రీన్ చానెల్ ఏర్పాటు చేశామని పోలీస్ అధికారులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు