Car Accident : బాలయ్య ఇంటి వద్ద ఫెరారీ కారు బీభత్సం.. తక్కుతుక్కైంది..
Road Accident : జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఫెరారీ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది.
Jublee Hills Car Accident
Car Accident : జూబ్లీహిల్స్ రోడ్డు నెం.45లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఫెరారీ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. డివైడర్ పైఉన్న కరెంట్ పోల్‌ను బలంగా ఢీకొట్టింది.. ఎదురుగా వస్తున్న వాహనాలనుసైతం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫెరారీ కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. మరోవైపు ఎదురుగా వస్తున్న మరో నాలుగు కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.
Also Read : Operation Kagar : ‘ఆపరేషన్ కగార్’లో కీలక పరిణామం.. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ..
ప్రమాదంలో గాయపడిన పలువురిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సమయంలో కారు అతివేగంతో ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఫెరారీ కారులోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం అనంతరం తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ప్రమాద ఘటన స్థలిని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన ఫెరారీ కారు వెంకట రాజారెడ్డి పేరుతో రిజిస్టర్ అయ్యి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
