BJP Telangana: ఒకే ఒక అభ్యర్థి పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా

సింగిల్ పేరుతో తెలంగాణ బీజేపీ రెండో లిస్ట్ విడుదల చేసింది. ఈ పేరు ఎవరితో తెలుసా?

assembly election 2023 BJP telangana second list with mithun kumar reddy name

AP Mithun Kumar Reddy: ఒకే ఒక అభ్యర్థి పేరుతో తెలంగాణ బీజేపీ రెండో జాబితా విడుదలయింది. ఇంతకీ ఈ పేరు ఎవరిదో తెలుసా? మాజీ ఎంపీ, సీనియర్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ కుమార్ రెడ్డి పేరుతో బీజేపీ సెకండ్ లిస్ట్ విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా మిథున్ కుమార్ రెడ్డిని కమలం పార్టీ ఖరారు చేసింది. శాసనసభకు పోటీ చేసే 52 మంది అభ్యర్థుల పేరుతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మహబూబ్ నగర్ శాసనసభ సీటును మిథున్ కుమార్ రెడ్డికి కేటాయించడంపై బీజేపీలో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి జితేందర్ రెడ్డి ఎందుకు తప్పుకున్నారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసేందుకే ఆయన అసెంబ్లీ ఎన్నికల బరి తప్పుకున్నారన్న గుసగుసలు కూడా విన్పిస్తున్నాయి. అయితే ఒకే కుటుంబానికి బీజేపీ రెండు టిక్కెట్లు ఇస్తుందా, లేదా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. అసలు ఎన్నికల్లో పోటీ చేస్తారో, లేదో జితేందర్ రెడ్డి ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి కుమారుడికి అసెంబ్లీ టికెట్ కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత, నీలం మధు, కపిలవాయి దిలీప్

మహబూబ్ నగర్ నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.