PM Modi : బీజేపీ దూకుడు.. మరోసారి తెలంగాణకు ప్రధాని మోదీ, టూర్ షెడ్యూల్ ఖరారు

PM Modi Telangana Tour : మ. 2.15 గంటల నుండి 2.55 గంటల వరకు 30 నిమిషాల పాటు కామారెడ్డి సభలో పాల్గొంటారు. 5గంటల 45 నిమిషాల నుండి ప్రధాని మోదీ షెడ్యూల్ రిజర్వ్ చేసి పెట్టిన పీఎంఓ.

PM Modi Telangana Tour Schedule (Photo : Facebook)

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడింది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక, బీజేపీ దూకుడు పెంచింది. ప్రచార పర్వాన్ని మరింత వేగవంతం చేయనుంది. ఏకంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగనున్నారు. మరోసారి తెలంగాణకు రానున్నారు. పలు సభలు, సమావేశాలు, రోడ్ షో లలో ప్రధాని పాల్గొంటారు. బీజేపీ తరపున ప్రచారం చేయనున్నారు.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు సంబంధించి అధికారిక షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న మహేశ్వరం, కామారెడ్డి సభల్లో ప్రధాని పాల్గొంటారు. 26న తూప్రాన్, నిర్మల్, 27న మహబూబ్ నగర్, కరీంనగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్ నగరంలో రోడ్ షోకు హాజరవుతారు. ఈ సభలు, రోడ్ షోలకు మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్..

ప్రధాని మోదీ అధికారిక పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన పీఎంఓ.
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఒకరోజు, తిరుపతిలో మరోరోజు విడిది.
25వ తేదీన 1.25 గంటలకు హాకీంపేట విమానాశ్రయానికి నరేంద్ర మోదీ.
అక్కడి నుండి ఆర్మీ హెలికాప్టర్ లో 2.05 గంటలకు కామారెడ్డికి పయనం.
మ. 2.15 గంటల నుండి 2.55 గంటల వరకు 30 నిమిషాల పాటు కామారెడ్డి సభలో పాల్గొనున్న మోదీ.
మ.3 గంటల 10 నిమిషాలకు బయలుదేరి 4గంటల వరకు మహేశర్వం హెలిప్యాడ్ కు చేరుకోనున్న ప్రధాని.
4గంటల 15 నిమిషాల నుండి 4గంటల 55 నిమిషాల వరకు దాదాపు 40 నిమిషాలు మహేశర్వం నియోజకవర్గం సభలో పాల్గొంటారు.
5గంటల 30 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయనికి మోదీ. అనంతరం 5గంటల 45 నిమిషాలకు రాజ్ భవన్ కు చేరుకుంటారు.

Also Read : కేసీఆర్‭కు చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం కట్టిస్తా.. రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్

5గంటల 45 నిమిషాల నుండి ప్రధాని మోదీ షెడ్యూల్ రిజర్వ్ చేసి పెట్టిన పీఎంఓ.
రాత్రి రాజ్ భవన్ లో బస చేయనున్న ప్రధాని.
26వ తేదీన రాజ్ భవన్ నుండి బయలుదేరి 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుండి 11.25 గంటలకు గచ్చిబౌలిలోని కన్హా శాంతి వనానికి నరేంద్ర మోదీ.
11.30 నుండి 12.45 వరకు కన్హా శాంతి వనంలోనే నరేంద్ర మోదీ.
12.55 నుండి శాంతి వనం నుండి బయలుదేరి 1.35కు తూప్రాన్ హెలిప్యాడ్ చేరుకోనున్న ప్రధాని.
1.45 నుండి 2.25 నిమిషాల వరకు తూప్రాన్ బహిరంగ సభలో పాల్గొంటారు.
2.35 తూఫ్రాన్ నుండి బయలుదేరి 3.45కు నిర్మల్ బహిరంగ సభకు నరేంద్రమోదీ.
3.45 నుండి 4.25 వరకు 40 నిమిషాలు నిర్మల్ బహిరంగసభలో పాల్గొన్న నరేంద్రమోదీ.

Also Read : సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన : పవన్ కల్యాణ్

4.40 నిర్మల్ నుండి బయలుదేరి 5.45కు హాకీంపేట విమానాశ్రయనికి చేరుకోనున్న నరేంద్రమోదీ.
5.50కి హాకీంపేట ఎయిర్ పోర్టు నుండి బయలుదేరి తిరుపతి వెళ్లనున్న నరేంద్రమోదీ.
6.55 నిమిషాలకు తిరుపతి విమానాశ్రయనికి నరేంద్రమోదీ.
రాత్రికి తిరుపతిలోనే బస చేయనున్న నరేంద్రమోదీ.
సాయంత్రం 6.55 నుండి మరుసటి రోజు ఉదయం 10.25 వరకు రిజర్వులో నరేంద్రమోదీ షెడ్యూల్.