Revanth Reddy : కేసీఆర్ మోసం చేశారు, ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయం- రేవంత్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ

ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని, కేసీఆర్ ను క్షమించేది లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒక కసి, పట్టుదల ప్రజల్లో కనిపిస్తోంది. కత్తి పట్టుకున్నోడు ఎప్పటికైనా కత్తికే బలైతాడు అని రేవంత్ రెడ్డి అన్నారు.

10tv Exclusive Interview With Revanth Reddy

సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇస్తే.. కేసీఆర్ ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు. ఈసారి కేసీఆర్ ఆటలు సాగవు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు ఖాయం అంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో 10టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ‘ఆట మొదలైంది’..

ప్రశ్న : ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?
”ఈసారి ఎన్నికలను రాజకీయ నాయకులు, పార్టీలు నిర్వహించడం లేదు. ప్రజలే ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని, కేసీఆర్ ను క్షమించేది లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఒక కసి, పట్టుదల ప్రజల్లో కనిపిస్తోంది” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : నేనంటే కేసీఆర్‌కి భయం, తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం- ప్రధాని మోదీ

ప్రశ్న : కాంగ్రెస్ లోకి మీరు తెచ్చిన 40మంది రేపు గెలిచాక పార్టీ మారరని ఏంటి గ్యారెంటీ?
”రేపు అధికారంలోకి వచ్చేదే కాంగ్రెస్. మరి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు ఎందుకు పార్టీ మారతారు? మేము కూడా కాంగ్రెస్ లోకి వస్తాము అని వాళ్లు అడగాల్సిందే తప్ప మా పార్టీ నుంచి ఎవరూ వెళ్లరు. కత్తి పట్టుకున్నోడు ఎప్పటికైనా కత్తికే బలైతాడు. ఏ ఫిరాయింపులతో అయితే బలపడ్డాను అని కేసీఆర్ అనుకున్నారో అవే ఇవాళ కేసీఆర్ కు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి” అని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రశ్న : కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు? మీరేమంటారు?
”ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలో కాంగ్రెస్ కు ఒక విధి విధానం ఉంది. ఆ ప్రక్రియ ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయి తప్ప నన్ను ఇష్టపడే వాళ్లు, అవమానించే వాళ్లు చెప్పినంత మాత్రాన సీఎం కాలేము. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది పార్టీదే తుది నిర్ణయం” అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రశ్న : రేవంత్ రెడ్డి టార్గెట్ సీఎం కావడమేనా?
”రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎవరైనా సీఎం కావాలనే అనుకుంటారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. ఏ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని అడిగినా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు. ఏ రాజకీయ నాయకుడు అయినా అల్టిమేట్ గా హయ్యస్ట్ పోస్ట్ కావాలనే కోరుకుంటాడు. అది నేచురల్. కాబట్టి దానిపై చర్చించడంలో అర్థమే లేదు. సీఎం పోస్టుపై నేను కొత్తగా నా అభిప్రాయం చెప్పాల్సిన అవసరం లేదు” అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : ఇందిరమ్మ రాజ్యం బాగుంటే.. ఎన్టీఆర్ ఎందుకు పార్టీ పెట్టారు?- సీఎం కేసీఆర్

ప్రశ్న : ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకున్నది రేవంత్ రెడ్డి కోసమేనా?
”4 కోట్ల మంది ప్రజలు నన్ను సమర్థిస్తున్నారు. యావత్ తెలంగాణ సమాజమే కాంగ్రెస్ వైపు నిల్చుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరమే లేదు. తెలంగాణ సమాజంలో భాగమైన ఎవరైనా మద్దతిచ్చినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యక్తిగా మద్దతు ఇవ్వడం అనేది ఉండదు. ఏ మద్దతు అయినా అది కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టే” అని రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

 

ట్రెండింగ్ వార్తలు