PM Modi : నేనంటే కేసీఆర్‌కి భయం, తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం- ప్రధాని మోదీ

తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు.

PM Modi : నేనంటే కేసీఆర్‌కి భయం, తొలిసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం- ప్రధాని మోదీ

PM Modi Fires On KCR

కరీంనగర్ లో సకల జనుల విజయసంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ఆయన నిప్పులు చెరిగారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ట్రైలర్ చూపించాము అన్నారు. తెలంగాణ మొత్తం తిరిగాను అన్న ప్రధాని మోదీ.. మొదటిసారి అధికారంలోకి రాబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని మాట ఇచ్చామన్నారు.

వాళ్లు గెలిస్తే బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయం..
తెలంగాణలో పదేళ్లలో జరగని అభివృద్ధి వచ్చే ఐదేళ్లలో చేసి చూపిస్తామని హామీ ఇచ్చారాయన. ప్రజలు కలలు కన్న తెలంగాణని నిర్మిస్తామన్నారు. దేశ గౌరవం పెంచడానికి బీజేపీకి ఓటు వేయండని పిలుపునిచ్చారు మోదీ. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్‌ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీల సంగతి పక్కన పెడితే… ఆ పార్టీ అభ్యర్థులకే‌ గ్యారంటీ లేదన్నారు ప్రధాని మోదీ. వారు గెలిస్తే బీఆర్ఎస్ లోకి పోవడం ఖాయం అన్నారు ప్రధాని మోదీ.

మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారు..
కాంగ్రెస్ కి ఓటు వేస్తే బీఆర్ఎస్ కి ఓటు వేసినట్లే అన్నారు మోదీ. బీఆర్ఎస్, కాంగ్రెస్ మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రధాని మోదీ.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ ‌మాత్రమే మీ ప్రతిష్టని పెంచుతుందన్నారు. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ పీఎప్ఐ పుట్టుకొస్తుందన్నారు. నక్సలైట్ వ్యవస్థని బీజేపీ లేకుండా చేసిందన్నారు. బీఆర్ఎస్ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. కరీంనగర్ నగరం స్మార్ట్ నిధులు కేంద్రం ఇస్తే, మేమే ఇచ్చామని చెప్పుకుంటున్నారు అని విమర్శించారు.

Also Read : రైతుబంధు పథకాన్ని నిలిపివేయొద్దు.. ఈసీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వినతి

కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ దోపిడీ..
”కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ దోపిడీ చేశారు. మోదీ సర్కార్ పీఎం కిసాన్ యోజన ద్వారా రైతులకి అండగా ఉంది. కరీంనగర్ పిలిగ్రీ ఆర్ట్ కి మారు పేరు. వారిని అదుకోవడానికి‌ పీఎం విశ్వకర్మ పథకం తీసుకొస్తాం. కరీంగనర్ ని సిల్వర్ సిటీ చేస్తాం. తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తే మోదీ గ్యారంటీగా ఉంటారు. ఒకవైపు కేసీఆర్ ఉంటే మరోవైపు మీ సేవకుడు‌ మోదీ ఉన్నాడు. నేనంటే కేసీఆర్ కి భయం. అందుకే‌ నేను ఉన్న దగ్గరికి‌ రారు.

తెలంగాణలో పెట్రోల్ ధర ఎక్కువ..
మోదీ సర్కార్ పేదలకు‌ అండగా ఉంటుంది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు కేంద్రం నిధులు ఇచ్చినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. మహారాష్ట్ర, గోవా, గుజరాత్ లో పెట్రోల్ రేటు తక్కువగా ఉంది. తెలంగాణలో మాత్రం పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం. మాదిగలకి రిజర్వేషన్ కల్పిస్తాం. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? నీళ్ళు, నిధులు, నియామకాలు ఇచ్చారా? డిసెంబర్ 3న బీఆర్ఎస్ టికెట్ ఖతం అవుతుంది.

Also Read : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

లిక్కర్ స్కాంలో నిందితులు బయటికి వస్తారు..
కేసీఆర్ కుటుంబానికి భయం పట్టుకుంది. లిక్కర్ స్కాంలో నిందితులు బయటికి‌ వస్తారు. దోచుకున్న సొమ్ముని‌ కక్కిస్తాం. కాంగ్రెస్ వస్తే తెలంగాణని ఏటీఎంలా మార్చుకుంటారు. కాంగ్రెస్ వస్తే ప్రతి దగ్గర లూటీ‌ జరుగుతుంది. కాంగ్రెస్ ని ఎప్పుడూ ‌నమ్మకండి. బీజేపీ, మోదీపై‌ భరోసా ఉంచండి. పనితనం చూడండి. మరొకసారి మోదీ సేవ పొందడానికి భారత దేశ ప్రజలు సిధ్ధంగా ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది” అని ప్రధాని మోదీ అన్నారు.