Election Commission : రైతుబంధు పథకాన్ని నిలిపివేయొద్దు.. ఈసీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వినతి

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విన్నవించింది. తెలంగాణ రైతాంగానికి నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అయిన నేపథ్యంలో ఎన్నికలు చూపించి ఎన్నికల కమిషన్ మళ్లీ ఈ పథకాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ కోరింది....

Election Commission : రైతుబంధు పథకాన్ని నిలిపివేయొద్దు.. ఈసీ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వినతి

Rythu Bandhu scheme

Election Commission : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రైతు బంధు పథకాన్ని నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ విన్నవించింది. తెలంగాణ రైతాంగానికి నగదు బదిలీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అయిన నేపథ్యంలో ఎన్నికలు చూపించి ఎన్నికల కమిషన్ మళ్లీ ఈ పథకాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ కోరింది. రైతుబంధు అనుమతి ఉపసంహరణ నేపథ్యంలో తెలంగాణా ఎన్నికల నిర్వహణ అధికారి వికాస్ రాజాను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసింది.

ALSO READ : రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? : హ‌రీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవ రావు, బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జి సోమ భరత్, లెజిస్లేటివ్ పార్టీ సెక్రటరీ రమేష్ రెడ్డి తదితరులున్నారు. రైతుబంధు నిధుల విడుదలకు అనుమతి ఇచ్చి, మళ్లీ రద్దు చేయడం సరి కాదని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. రైతుబంధు ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ కేవలం రైతుబంధు ను ఎన్నికల ప్రచారానికి వాడుకోకుండా ఆపాలని మాత్రమే ఈసిని కోరింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం మొత్తం రైతుబంధు అనుమతినే రద్దు చేసింది.

ALSO READ : హరీశ్‌ కామెంట్స్‌తో రైతుబంధుకు ఈసీ బ్రేక్

హరీష్ రావు మాట్లాడిన దానికి కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని.. ఈసీ నిర్ణయంతో తెలంగాణ లోని 4 కోట్ల మంది రైతులకు నస్టం జరుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు కు వెళదామంటే తమకు సమయం లేదని, అందుకే తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 7,600 కోట్లు జమ చేయాలన్న తెలంగాణ నగదు బదిలీ పథకాన్ని నిలిపివేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేసీఆర్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

ALSO READ : Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

ఈ రైతు బంధు పథకం తమ పార్టీ ప్రభుత్వం అమలుచేసిన పాత పథకమని బీఆర్ఎస్ పేర్కొంది. అంతకు ముందు డిసెంబరు 28వతేదీన ప్రారంభమయ్యే యాసంగి పంట సీజన్‌కు ముందు రాష్ట్రంలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ.7,600 కోట్లు జమ చేయాలని తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిని ఆదేశించారు. రైతుబంధు పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వానాకాలం, యాసంగి సీజన్‌లకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పంట పెట్టుబడిని అందజేస్తోంది.

ALSO READ : Telangana Assembly Election 2023 : మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో కేంద్ర బలగాల మోహరింపు…డ్రోన్లతో నిఘా

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్యకలాపాలను చేపట్టడానికి రైతుల ఖాతాలలో నేరుగా పెట్టుబడిని అందిస్తుంది. సీఎం కేసీఆర్ వ్యవసాయ అనుకూల నిర్ణయాల వల్ల భారతదేశంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.  ఈనెల 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటనను ఈసీ ప్రస్థావించింది. ఈసీ తాజా నిర్ణయంతో రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ పడటంతో బీఆర్ఎస్ మరోసారి అనుమతి ఇవ్వాలని కోరింది.