Priyanka Gandhi : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ చేసిందని ప్రశ్నించారు.

Priyanka Gandhi : మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారు : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Election Campaign

Updated On : November 27, 2023 / 4:28 PM IST

Priyanka Gandhi – BRS : బీఆర్ఎస్ పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ధరణి పోర్టల్ పేరుతో ఇళ్లు, వాకిళ్లు, భూములు లాక్కుంటారని పేర్కొన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అవుతాయని, అవినీతి ఆకాశన్నంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అగవని అలాగే కొనసాగుతాయని చెప్పారు.

సోమవారం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి కుంభం అనిల్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రియాంక గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  కేసీఆర్ పాలనలో ప్రతీ రంగంలోనూ అవినీతేనని విమర్శించారు.

Also Read : కేసీఆర్ అంటేనే అబద్ధం, మోసం : రఘునందన్ రావు

ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. రెండు సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రశ్నించారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే భూ మాఫియా లేస్తుందన్నారు. యువత ఆశాలపై నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణ సాధించుకున్న లక్ష్యాలు నెరవేరాయా అని అడిగారు.

కాంగ్రెస్  పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, ఆరు గ్యారంటీలు పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.