Attack On Police: హైదరాబాద్ లో కానిస్టేబుల్ పై దాడి
హైదరాబాద్ లో కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ విధుల్లో ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డారు.
- kunduru Vinod
- Updated on- June 9, 2021 / 01:23 PM IST
Attack On Police
Attack On Police: హైదరాబాద్ లో కానిస్టేబుల్ పై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. చిలకలగూడ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. కానిస్టేబుల్ విధుల్లో ఉన్న సమయంలో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు బలమైన గాయమైంది. ఓ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్ కిరణ్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తీసుకొస్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడి చేశారు.
తలపై గట్టిగా కొట్టడంతో బలమైన గాయమైంది. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్ళిపోయాడు.. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఇక దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
