×
Ad

B Pharm Colleges Fees : విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఫార్మసీ కాలేజీలకు ఫీజులు ఖరారు.. ఏ కోర్సుకు ఎంత ఫీజు.. ఏ కాలేజీలో ఎక్కువ.. ఫుల్ డీటెయిల్స్..

B Pharm Colleges Fees : తెలంగాణలో బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

B Pharm Colleges Fees

  • తెలంగాణలో బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజుల నిర్ణయం
  • బీఫార్మసీ గరిష్ఠ ఫీజు రూ.1.21 లక్షలు
  • ఫార్మా -డీకి గరిష్ఠ ఫీజు రూ.1,37,500
  • బీఆర్క్‌కు గరిష్ఠ ఫీజు రూ.1.32 లక్షలు
  • ఉత్తర్వులు జారీ చేసిన విద్యాశాఖ

B Pharm Colleges Fees : తెలంగాణలో బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బీఆర్క్ కోర్సుల ఫీజులను పెంచుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం.. దీనికి సంబంధించిన జీవో నెంబర్ 10ని విడుదల చేసింది.

Also Read : Gold Price Today : బంగారం ధరల్లో రాత్రికిరాత్రే భారీ ట్విస్ట్.. ఏపీ, తెలంగాణలో ఈరోజు గోల్డ్, సిల్వర్ ధరలు ఎంతంటే? ఫుల్ డీటెయిల్స్..

తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 120 బీ-ఫార్మసీ కళాశాలు ఉన్నాయి. వాటిలో గతంతో పోలిస్తే 10 నుంచి 15శాతం వరకు ఫీజులు పెరిగాయి. బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21లక్షలు ఫీజుగా నిర్ణయించారు. గతంలో కేవలం మూడు కాలేజీల్లోనే లక్ష రూపాయల పై చిలుకు ఫీజులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 103 కాలేజీల్లో ఫీజు రూ.50వేల మార్క్‌ను దాటగా.. 17 విద్యా‌సంస్థల్లో మాత్రమే రూ.45వేల నుంచి రూ.49,500లోపు ఫీజులు ఉన్నాయి.

అయితే, బీఫార్మసీలో లక్షకుపై ఫీజులున్న కాలేజీల వివరాలను పరిశీలిస్తే.. గురునానక్‌ టెక్నికల్‌ క్యాంపస్‌ (1.21 లక్షలు), సీఎంఆర్‌ (1.10 లక్షలు), విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ (1,06,400), సుల్తాన్‌ ఉలూమ్‌ (1,05,800), పుల్లారెడ్డి (1,02,600), గీతాంజలి (1,00,800), ఎస్‌.ఎన్‌.వనితా మహావిద్యాలయ (లక్ష) ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా 79 ఫార్మా-డీ కాలేజీలు ఉన్నాయి. ఫార్మా-డీలో గతంలో గరిష్ఠంగా రూ.1.25లక్షలు ఉండగా.. ఈసారి రూ. 1,37,500కి పెరిగింది. మొత్తం 13చోట్ల ఫీజు లక్ష రూపాయలకుపైగా ఉంది. ఈ కోర్సులో కనిష్ఠ ఫీజుగా రూ.68వేలను ప్రభుత్వం నిర్ణయించింది.

ఫార్మా-డీలో లక్షకు‌పైగా ఫీజులున్న కాలేజీల వివరాలను పరిశీలిస్తే.. గీతాంజలి (1,97,500), గురునానక్ (1,37,500), శ్రీదత్త (1,26,500), శ్రీ ఇందు (1.10లక్షలు), మల్లారెడ్డి (1.10లక్షలు), సెయింట్ పీటర్స్ (1.10 లక్షలు), సుల్తాన్ ఉలూమ్ (1.10 లక్షలు), ఎస్ఎన్ వనితా మహావిద్యాలయ (1.08 లక్షలు), సెయింట్ పాల్స్ (1.08 లక్షలు), తాళ్ల పద్మావతి (1.08 లక్షలు), భరత్ (1.07 లక్షలు), మల్లా రెడ్డి ఫార్మసీ (1,02,600), సీఎంఆర్ (రూ.లక్ష).

బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఉన్నాయి. వీటిలో అశోకా కళాశాలలో మాత్రమే ఫీజు రూ.1.32లక్షలు ఉంది. మిగిలిన వాటిల్లో ఫీజు రూ.లక్షలో నిర్ణయిస్తూ విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.