Babu Mohan
BJP Leader Babu Mohan : సినీ నటుడు, మాజీ మంత్రి బాబూ మోహన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతకరంగా ఉందని, పొమ్మనకుండా పొగపెడుతున్నారంటూ బాబూమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకోసం చాలా కష్టపడ్డాను, తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల్లో తిరిగి ప్రచారం చేశా. ఏ, బీ, సీ, డీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా నన్ను డి కేటగిరిలో పెట్టారంటూ బాబూ మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నారని అర్థమైందని అన్నారు. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలదించాలని నేను నిర్ణయించుకున్నానని చెప్పారు.
Also Read : శరవేగంగా సికింద్రాబాద్ కొత్త రైల్వే స్టేషన్ పనులు: కిషన్ రెడ్డి
అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి నన్ను దూరం పెడుతూ, కనీసం నా ఫోన్ కూడా ఎత్తకుండా బీజేపీలోని కొందరు నాయకులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని బాబూ మోహన్ అన్నారు. ఇదిలాఉంటే బాబూ మోహన్ ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీచేశారు. గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు బాబు మోహన్ ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ టికెట్ బాబూ మోహన్ కు ఇచ్చేందుకు కమలనాథులు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో బాబూ మోహన్ బీజేపీకి రాజీనామా చేశారు.
Also Read : Gone Prakash Rao : సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశ్ రావు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం నుంచి బాబు మోహన్ కుమారుడు ఉదయ్ మోహన్ కు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం ప్రయత్నించింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి బీజేపీ మా కుటుంబంలో చిచ్చు పెడుతుందని బాబూ మోహన్ ఆరోపించారు. దీంతో చివరి నిమిషంలో ఆందోల్ టికెట్ ను బీజేపీ అధిష్టానం బాబూ మోహన్ కు కట్టబెట్టిన విషయం తెలిసిందే.