Bade Nagajyothi Video: ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలియగానే జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి తీవ్ర భావోద్వేగం

ములుగు నుంచి తనను పోటీకి దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

Bade Nagajyothi

Bade Nagajyothi – Mulugu: తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును ప్రకటించారని తెలియగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ములుగు జెడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి(29). ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) 115 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో బడే నాగజ్యోతి ఇంట్లో టీవీ చూస్తున్నారు.

ములుగు నుంచి తనను పోటీకి దింపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించగానే ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ములుగులో కాంగ్రెస్ నాయకురాలు సీతక్క సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ స్థానం నుంచి ఈ సారి కూడా సీతక్కనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్‌ ప్రత్యేక దృష్టిసారించింది.

వ్యూహాత్మకంగా సీతక్కకు దీటైన అభ్యర్థిని నిలబెట్టడంపై బీఆర్ఎస్ ప్రణాళికలు వేసుకుంది. జెడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బడే నాగ జ్యోతి, తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత లేదా మాజీ మంత్రి చందులాల్ కుమారుడు ప్రహ్లాద్‌ లో ఒకరిని ఈ నియోజక వర్గం నుంచి బరిలోకి దింపుతారని ప్రచారం జరిగింది. చివరకు బడే నాగ జ్యోతి పేరును ఖరారు చేశారు.

Mynampally Issue: సొంత పార్టీ ఎమ్మెల్యేపై మండిపడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు