యంగ్ హీరోతో బ్యాడ్మింటిన్ బ్యూటీ గుత్తా జ్వాల ఎంగేజ్ మెంట్, త్వరలోనే పెళ్లి
- Naveen
- Updated on- September 7, 2020 / 05:43 PM IST
Vishnu Vishal and Jwala Gutta get engaged: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఎంగేజ్ మెంట్ అయ్యింది. తన ప్రియుడు, తమిళ యువ హీరో విష్ణు విశాల్‌తో నిశ్చితార్థం చేసుకుంది గుత్తా జ్వాల. కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇప్పడు ఉంగరాలు మార్చుకుని నిశ్చితార్థం చేసుకున్నారు. తాను విష్ణును వివాహం చేసుకోబోతున్నానని సోషల్‌మీడియా వేదికగా గుత్తా ప్రకటించింది.
సోమవారం(సెప్టెంబర్ 7,2020) గుత్తా 37వ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ప్రేయసికి శుభాకాంక్షలు చెబుతూ విశాల్ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు గుత్తా జ్వాల. ఇది మన జీవితాలకు కొత్త ఆరంభం. ఇలానే పాజిటివ్‌గా ఉందాం. మన బంగారు భవిష్యత్తు దిశగా అడుగులు వేద్దాం. మాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. మా కోసం అర్ధరాత్రి సమయంలోనూ ఉంగరం తెచ్చిన బసంత్ జైన్‌కు (గుత్తా జ్వాల మేనేజర్) ధన్యవాదాలు’ అని తెలిపాడు.
వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరి చేతికి ఉంగరాలు కనపడుతున్నాయి. గుత్తాజ్వాల పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు విష్ణు చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాడట. బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా విష్ణు విశాల్.. గుత్తా జ్వాలకు మరో సర్ ఫ్రైజ్ ఇచ్చాడట. ఆ వేడుకల్లోనే ఆమె చేతికి ఉంగరం తొడిగి ఎంగేజ్మెంట్ అయిపోయిందనిపించాడు.
బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వగా అందులో విష్ణు.. గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉంది. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతన్నట్లు క్లారిటీ ఏర్పడింది.
ఇక హీరో విష్ణు విశాల్ 2010లో రజనీని పెళ్లి చేసుకున్నాడు. 2018 జూన్‌లో రజనీతో విడిపోయాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయింది.
