Balka Suman-Revanth Reddy
Balka Suman: మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ విస్తృతస్థాయి నియోజవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలతో విస్తృత సమావేశంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, బాల్క సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
వేదికపై బాల్కసుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. ఒకసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. రేవంత్ రెడ్డిని కొడతానంటూ వాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఉరుకోబోమని బాల్క సుమన్ హెచ్చరించారు.
ఓటమితో భయపడాల్సిన అవసరం లేదని, గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ కోసమని బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఆంధ్ర ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడ్డ పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు.
ఉద్యమానికి వెన్నుపోటు పొడిచిన కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేశామని బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
Also Read: అందుకే వైసీపీని వీడాను.. ఇకపై నేను..: వసంత కృష్ణ ప్రసాద్