Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్.. మరో సెక్షన్ నమోదు..
Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్ జోడించారు పోలీసులు.
- Harish Thanniru
- Updated on- May 18, 2026 / 12:08 PM IST
Bandi Bhagirath Case
Bandi Bhagirath Case : బండి భగీరథ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొత్తగా మరో సెక్షన్ జోడించారు పోలీసులు. ఒకే బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ బీఎన్ఎస్ 64(2)(M) సెక్షన్ జోడించారు. మరోవైపు పేట్ బషిరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. భగీరథ్ ను కస్టడీకి కోరేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేడ్చల్ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది. బాలిక స్టేట్మెంట్ ఆధారంగా విచారణ జరిపే అవకాశం ఉంది. ప్రస్తుతం బండి భగీరథ్ చర్లపల్లి జైలులో ఉన్నాడు.
బాధితురాలు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల స్టేట్మెంట్ కూడా కోర్టు రికార్డు చేసింది. ఇప్పటికే రెండుసార్లు స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. బాధిత కుటుంబం నుంచి న్యాయస్థానం కీలక వివరాలు సేకరించింది. మరోవైపు.. గత కొన్ని రోజులుగా బండి భగీరథ్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసిన పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. మొత్తం 27 మంది ఇన్ఫ్లూయెన్సర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తగా వాటిపై విచారణ జరిపి 14 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మిగిలిన వారి విషయంలో దర్యాప్తు చేపట్టి.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
