Bandi Bhagirath: సిట్ విచారణకు బండి భగీరథ్ గైర్హాజరు.. ఏం జరగనుంది?
బాధితురాలి నుంచి రెండోసారి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ పై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ లో లైంగిక దాడికి సంబంధించిన సెక్షన్లను జోడించారు.
- Naveen
- Updated on- May 13, 2026 / 05:12 PM IST
Bandi Bhagirath: పోక్సో కేసులో సిట్ విచారణకు బండి భగీరథ్ హాజరుకాలేదు. పోక్సో కేసులో మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని బండి భగీరథ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే, గడువు ముగిసినా బండి భగీరథ్ విచారణకు రాలేదు. దీంతో సిట్ అధికారులు తర్వాత ఏం చేస్తారు అనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు బండి భగీరథ్. దీనిపై రేపు వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది. ఇటు బాధితురాలి నుంచి రెండోసారి స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు బండి భగీరథ్ పై నమోదైన కేసు ఎఫ్ఐఆర్ లో లైంగిక దాడికి సంబంధించిన సెక్షన్లను జోడించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకి సంబంధించి ఇవాళ మధ్యాహ్నం 2గంటల లోపు విచారణకు రావాలని సిట్ అధికారులు నిన్న భగీరథ్ కు నోటీసులు ఇచ్చారు. అయితే భగీరథ్ విచారణకు రాలేదు. దీంతో సిట్ అధికారులు నెక్ట్స్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. మరోసారి భగీరథ్ కు నోటీసులు ఇస్తారా అనేది చూడాలి.
కాగా, భగీరథ్ ముందస్తు బెయిల్ కు సంబంధించి రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు తర్వాత భగీరథ్ సిట్ విచారణకు హాజరవుతాడా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి అనేక కోణాల్లో దర్యాఫ్తు చేశారు. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాఫ్తును ముమ్మరం చేసింది.
Also Read: తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే- కొడుకు కేసుపై బండి సంజయ్ ఎమోషనల్
