CM KCR
Telangana Dalit bandhu : దళిత బంధు పథకంలో కొంతమంది ఎమ్మెల్యేలు చేతివాటం చూపిస్తున్నారని..రైతులకు అందాల్సిన డబ్బుల్ని నొక్కేస్తున్నారని వారు ఎవరో తనకు తెలుసని..వారి లిస్ట్ నాదగ్గర ఉంది అంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టించాయి. అటువంటివారి తీరుమార్చుకోవాలని లేదంటే పదవి నుంచే కాదు పార్టీ నుండి తప్పిస్తామని వార్నింగ్ ఇచ్చారు గులాబీ బాస్ కేసీఆర్. సాక్షత్తు కేసీఆరే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటంతో పతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
దళితబంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తుంటే మీరేం చేస్తున్నారు?వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటంలేదు?అని ప్రశ్నిస్తున్నారు. ఎద్దేవా చేస్తున్నారు.దీంట్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు.దీనిపై బండి సంజయ్ వ్యాఖ్యానిస్తు ‘మీ అనుచరులు కమీషన తీసుకుంటే మీదే బాధ్యత..30 శాతం కమిషన్ సార్-కార్ అంటూ ట్వీట్ చేశారు.
ఇక దీనిపై షర్మిల తనదైనశైలిలో విమర్శలు చేశారు. దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అని ప్రశ్నించారు.అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అటువంటి బీఆర్ఎస్ కు అధికారంలో ఉండే అర్హత లేదంటూ విమర్శలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని ప్రజలకే కర్రుకాల్చి వాత పెట్టేరోజు దగ్గరలోనే ఉంది అంటూ విమర్శించారు.