Bandi Sanjay : బీజేపీ బలోపేతంపై ఫోకస్.. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు

తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

Bandi Sanjay : తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే వారి కోసం సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గా బీజేపీ సీనియర్ నేత, నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు.

EV Charging: దేశంలో ఎవరైనా ఎక్కడైనా విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ పెట్టుకోవచ్చు

ఈ కమిటీలో స్వామి గౌడ్, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్, డి.రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావుతో పాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారు. పార్టీలో చేరడానికి ఎవర్ని సంప్రదించినా ముందుగా సమన్వయ కమిటీకి తెలపాల్సి ఉంటుంది. పార్టీలో చేరే వారితో చర్చలు, వారి బలాబలాలు, గుణగణాలను అంచనా వేయడం, పార్టీ నాయకత్వానికి తెలియజేయడం వీరి బాధ్యత..

అలాగే ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ వేశారు బండి సంజయ్. ఈ నెల 19న రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్ లో బీజేపీ నేతలు మీటింగ్ నిర్వహించనున్నారు. ఎస్టీ నియోజకవర్గాల సమన్యాయ కమిటీ ఛైర్మన్ గా గరికపాటి మోహన్ రావుని నియమించారు. చాడా సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలం గౌడ్ సభ్యులుగా ఉంటారు.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

డిసెంబరు 28నే SC నియోజకవర్గాలపై బీజేపీ నేతలు సమావేశమయ్యారు. మిషన్-19 పేరుతో ఎస్సీ నియోజకవర్గలపై ఫోకస్ పెట్టారు. అదే తరహాలో ఎస్టీ నియోజకవర్గలపైనా కమలనాథులు ఫోకస్ పెట్టనున్నారు.

ట్రెండింగ్ వార్తలు