bandi sanjay: బండి సంజయ్‌కు అస్వస్థత

మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు.

Bandi Sanjay

bandi sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆయన పదకొండు రోజులుగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మండుటెండలో పాదయాత్ర చేస్తుండటంతో ఆదివారం వడదెబ్బ తగిలింది. దీంతోపాటు ఎసిడిటీకి కూడా గురయ్యారని వైద్యులు తెలిపారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన శిబిరం వద్ద డాక్టర్ శరత్ ఆధ్వర్యంలో వైద్యులు ఆయనను పరీక్షించి, చికిత్స అందించారు.

ktr challenge to bjp : బీజేపీకి కేటీఆర్ సవాల్..రాసి పెట్టుకోండి..నా లెక్కలు తప్పైతే మంత్రి పదివికి రాజీనామా చేస్తా

వడదెబ్బ, డీ హైడ్రేషన్‌తోపాటు ఎసిడిటీ వల్ల బండి సంజయ్ కొంత బలహీనంగా ఉన్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్రకు కొంత విరామం ఇవ్వాలని డాక్టర్లు సూచించారు. అయితే, బండి సంజయ్ మాత్రం పాదయాత్ర చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. మరికాసేపట్లో పాదయాత్ర తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.