Bandi sunjay
Bandhi Sunjay: ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో విచారించేందుకు సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంటికి వచ్చారు. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. కేవలం సాక్షిగా మాత్రమే కవిత వివరణను నమోదు చేయనున్నారు. సీఆర్పీసీ 160 కింద ఆమె వాంగ్మూలాన్ని తీసుకోనున్నారు. కవిత ఇంటికి వచ్చిన సీబీఐ బృదంలో మహిళ అధికారులు కూడా ఉన్నారు. అయితే, విచారణ సాయంత్రం వరకు కొనసాగే అకాశం ఉంది. ఒకపక్క కవిత నివాసంలో సీబీఐ అధికారులు ఆమెను విచారిస్తున్న క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారు: బండి సంజయ్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఓ పక్క సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐ అంటే భయమెందుకని ప్రశ్నించారు. అవినీతి, తప్పు చేసేవారికి మాత్రమే దర్యాప్తు సంస్థలంటే వణుకు పడుతుందని, ఇప్పుడు బీఆర్ఎస్ నేతల పరిస్థితి అదేనని అన్నారు. తప్పుచేసిన వారంతా జైలుకు వెళ్లాల్సిందేనని, తప్పులేకుంటే నిజాయితీ నిరూపించుకోవాలని అన్నారు. ఎవరూ చట్టానికి అతిథులు కాదని, ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రినా? ముఖ్యమంత్రి బడ్డా అని చూడరని అన్నారు.
Bandi Sanjay: చట్టం ఎవరికీ చుట్టం కాదు..! తెలంగాణలో ఐటీ రైడ్స్‌పై సంజయ్ కీలక వ్యాఖ్యలు
స్వాతంత్ర్యం కోసం పోరాడినట్లు కవిత ఇంటి ముందు పెద్ద పెద్ద ప్లెక్సీలు ఎందుకు అంటూ సంజయ్ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో లక్షకోట్లు అక్రమాలకు పాల్పడినట్లు కవితపై ఆరోపణలు వచ్చాయని, ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరపని అన్నారు. బిడ్డపై లిక్కర్ కేసు దృష్టిని మళ్లించడానికి, గుజరాత్ ఫలితాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఎస్ఆర్ అంటూ కొత్తపాటపాడాడని, బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కూడా దాటదని, అసలు తెలంగాణలోనే కనుమరుగు అవుతుందని సంజయ్ అన్నారు.