Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం (ఏప్రిల్ 14) సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ అమ్మవారి ఆలయ దర్శనానికి బండిసంజయ్ కాన్వాయ్ బయల్దేరింది.

ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి అలంపూర్ చేరుకోనున్నారు. ముందుగా అలంపూర్ లో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు బండి సంజయ్. అనంతరం సాయంత్రం 4 గంటలకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహాంచనున్నారు.

Bandi Sanjay Praja Sangrama Yatra To Be Started From Today In Gadwala District

అనంతరం ఈ సాయంత్రం 5గంటలకు నిర్వహించే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బండి సంజయ్ తొలిరోజు జోగులాంబ అమ్మవారి చెంత నుంచి నాలుగు కిలో మీటర్లు పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇమ్మాపూర్ వరకు పాదయాత్ర బండి సంజయ్ కొనసాగనుంది. ఈ రాత్రి ఇమామ్‌పూర్‌లోనే ఆయన బస చేయనున్నారు.

ఈ రోజు రాత్రి జోగులాంబ గద్వాల్ జిల్లా ఇమ్మాపూర్ ప్రాంతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకోనున్నారు. ఈయన కూడా అక్కడే బస చేయనున్నారు. పాదయాత్ర శిబిరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కిషన్ రెడ్డి భోజనం చేయనున్నారు. ఈ పాదయాత్ర శిబిరంలోనే తొలిరోజు రాత్రి కిషన్ రెడ్డి విడిది చేయనున్నారు. శుక్రవారం ఉదయం బండి సంజయ్‌తో కలిసి కిషన్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.

Read Also : Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. 31 రోజులు.. 10 నియోజకవర్గాల్లో..

ట్రెండింగ్ వార్తలు