×
Ad

Bandi Sanjay : ఆ రెండు పార్టీల అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంకండి.. బీజేపీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు

Bandi Sanjay : రాష్ట్రంలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలను సృష్టిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలారా.. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంకండని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతల అరెస్టు, హౌస్ అరెస్టులపై సంజయ్ స్పందించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా..? అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి..? ఎమర్జెన్సీ రోజులు ప్రారంభయ్యాయి అంటూ బండి సంజయ్ కాంగ్రెస్ సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Telangana BJP : కాకరేపిన కామారెడ్డి ఘటన.. టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్.. ఈటల, ఏలేటి హౌస్ అరెస్టు.. తొపులాట.. ఉద్రిక్తత పరిస్థితి

రాష్ట్రంలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలను సృష్టిస్తున్నాయి. బీజేపీ కార్యకర్తలారా.. అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధంకండని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండని సూచించారు. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవటం దుర్మార్గమన్న సంజయ్.. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం అన్నారు.

కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ అని, ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు అని బండి సంజయ్ అన్నారు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం అక్రమం. రాళ్లదాడి స్పష్టంగా కనిపిస్తున్నా.. దాడికి పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.

బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.