Sub Registrar Office Timings Extend : బిగ్ అలర్ట్.. రిజిస్ట్రేషన్ ఆఫీసు ఆఫీసుకు వెళ్తున్నారా.. టైమింగ్స్ మారాయి.. రాత్రి వేళ కూడా రిజిస్ట్రేషన్లు..
Sub Registrar Office Timings Extend : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
telangana govt extends sub registrar office timing upto 7 30 pm to handle surge in property registrations
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
- సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళలు పొడగింపు
- మే 29 నుంచి జూన్ 3 వరకు
Sub Registrar Office Timings Extend : భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లే వారికి అలర్ట్.. టైమింగ్స్ మారుస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు రాత్రి 7.30 గంటల వరకు పని చేస్తాయి. మే 29 అంటే శుక్రవారం నుంచి ఈ కొత్త టైమింగ్స్ అమల్లోకి రానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు కొత్త టైమింగ్స్ అమలవుతాయి. అయితే టైమింగ్స్ మార్చడానికి గల కారణం ఏంటంటే..
తెలంగాణ కేబినెట్.. రాష్ట్రంలో భూముల విలువలను వాస్తవ మార్కెట్ ధరలకు అనుగుణంగా క్రమబద్ధీకరించాలని निर्णयయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పని వేళలను పొడిగిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్లకు డిమాండ్ పెరగడంతో.. ఈ నెల 29 నుంచి జూన్ 3 వరకు రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలందించడమే మా ప్రభుత్వ ధ్యేయం. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత, సౌకర్యం అనే మూడు మా ప్రధాన లక్ష్యాలు అని తెలిపారు. టైమింగ్స్ పెంచడంతో పాటు.. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రోజువారీ స్లాట్ బుకింగ్‌ల సంఖ్యను కూడా పెంచాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల డిమాండ్‌ను బట్టి అవసరమైతే అదనపు పని గంటల నియమాన్ని.. మరిన్ని రోజుల వరకు కూడా పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పొంగులేటి తెలిపారు.
దీంతో పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరిగే తహసీల్దార్ కార్యాలయాలతో కూడా నిరంతరం సమన్వయం పెంచుకుంటూ ఎక్కడా ఆలస్యం లేకుండా రైతులకు సేవలు అందించాలని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, సౌకర్యవంతమైన సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.
