17సీట్లను గెలిచి టీపీఎల్ క‌ప్‌ను గెలవబోతున్నాం : బండి సంజయ్

ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే. 400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదే. 400 స్థానాలతో మూడోసారి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మరోసారి కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ శనివారం బూత్ విజయ్ సంకల్ప అభిమాన్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.. మోదీలేని దేశాన్ని ఊహించుకోగలమా? అన్నారు. మోదీ హయాంలోనే దేశం అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందని, ప్రపంచ దేశాలు నేడు ఇండియావైపు చూస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ఇండియా పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) కప్ బీజేపీదేనని, రాష్ట్రంలోనూ టీపీఎల్ (తెలంగాణ పొలిటికల్ లీగ్) మొదలైంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ టీం దూసుకుపోతోందని బండి సంజయ్ అన్నారు.

Also Read : YS Vimalamma : వైఎస్ షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ టీంకు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు.. బీఆర్ఎస్ టీం సభ్యులున్నా.. నిరాశ, నిస్రృహల్లో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో 17సీట్లను గెలిచి టీపీఎల్ కప్ ను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అతితక్కువ వ్యవధిలో కాంగ్రెస్ పై తీవ్రమైన ప్రజావ్యతిరేకత మొదలైందని, రైతులు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశులు పోసి ఎదురు చూస్తున్నా పట్టించుకోవటం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాలు, తేమ, తరుగుతో పనిలేకుండా వడ్లు కొనేదిక్కే లేదు. కనీస ధరతో పాటు రూ. 500 బోనస్ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

Also Read : సెల్ఫీ దిగేందుకు అభిమాని ప్రయత్నం.. పక్కకు తోసేసిన బాలయ్య.. వీడియో వైరల్

దొంగ హామీలతో మోసంచేసిన కాంగ్రెస్ లైసెన్స్ ను రద్దు చేసేందుకు జనం సిద్ధమయ్యారని బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇదిగో నా ప్రోగ్రెస్ రిపోర్ట్.. కరీంనగర్ జనంకోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిందేమిటో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. మే 13న జరిగే పోలింగ్ లో కరీంనగర్ లో బీజేపీని బంపర్ మెజార్టీతో గెలిపించి మీ దమ్ము చూపించాలని ప్రజలను సంజయ్ కోరారు.

 

ట్రెండింగ్ వార్తలు