వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికే కేసీఆర్ ఇలా చేస్తున్నారు: బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులకు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్..

Bandi Sanjay

మెడకాయ మీద తలకాయ ఉన్న వారు ఎవరూ బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోరని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మీడియాతో చిట్ చాట్‌ చేస్తూ బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతి పార్టీతో పొత్తులు ఎందుకు పెట్టుకుంటామని ప్రశ్నించారు.

బీజేపీతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు సంప్రదింపులు జరుపుతున్నారని బండి సంజయ్ చెప్పారు. వారు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లకుండా ఉండడానికే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.

బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని పార్టీ నాయకులకు కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా పరస్పరం విమర్శలు చేసుకుంటూ బీజేపీ చర్చలో లేకుండా చేస్తున్నారని తెలిపారు.

బీఆర్ఎస్ అవినీతి అంతా కాగ్ రిపోర్ట్ ద్వారా బయట పడిందని బండి సంజయ్ చెప్పారు. కాళేశ్వరంపై సెంట్రల్ కమిటీ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందని తెలిపారు. కాళేశ్వరం పనికి రాదని చెప్పిందని అన్నారు. ప్రజా సమస్యలు ఏమీ లేనట్లు ఒక నది జలాల విషయం పట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటున్నాయని చెప్పారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్ జైల్లో ఉండేవారని బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయదని, ఈ కారణంతో ఆ పార్టీ నష్టపోతుందని చెప్పారు. తాము హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై కూడా దృష్టి పెట్టామని తెలిపారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీశ్ రావును బీజేపీలోకి తీసుకుంటామని చెప్పారు.

Congress Party : కాంగ్రెస్‌ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన ఐటీశాఖ.. గంట తరువాత పునరుద్ధరణ

ట్రెండింగ్ వార్తలు