BRS Ministers
BRS Ministers : పదో తరగతి ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యర్తలు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ అరెస్టుపై పలువురు బీఆర్ఎస్ మంత్రులు స్పందించారు. బండిపై మంత్రులు పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. తక్షణమే బండి సంజయ్ ను బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. అలాగే బండిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ పై పీడీ యాక్ట్ పెట్టాలి
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో బీజేపీ రాజకీయ ఆటలు మొదలు పెట్టిందని తెలిపారు. బీజేపీ నేతలను ప్రజలు ఛీత్కరించు కుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ను ఎదుర్కునే దమ్ము లేక విద్యార్థులు, వారి తల్లి దండ్రులను వాడుకుంటున్నారని ఆరోపించారు. 3వ తేదీ సాయంత్రం బండి సంజయ్ ప్రశాంత్ కు ఫోన్ చేసి ప్రశ్నపత్రాలు లీక్ కావాలని చెప్పిటనట్లు వెల్లడించారు.
కమలాపూర్ లో 9.45 గంటలకు ప్రశ్నపత్రాల ఫోటోలు తీశారని ఆరోపించారు. బండి సంజయ్ అదేశాలతోనే బీజేపీ కార్యకర్తలు ప్రశ్నపాత్రాల లీక్ చేశారని విమర్శించారు. విద్యార్థుల మనసులను గాయపరిచే విధంగా కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ లో బీజేపీ అనుబంధ సంఘం ఉపాధ్యాయులు పేపర్ బయటకు వచ్చేలా చేశారని ఆరోపించారు. బీజేపీ అనుబంధ సంఘాలన్నీ ఈ కుట్రలో భాగమేనని చెప్పారు. ఎవరు కుట్ర చేసినా తీవ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, టీఎస్పీఎస్సీ లీక్ కుట్ర దారుడు కూడా బండి సంజయ్ అని స్పష్టం చేశారు.
అధ్యక్ష పదవి నుంచి తొలగించాలి
బండి సంజయ్ అరెస్ట్ పై మంత్రి జగదీష్ రెడ్డి జగదీష్ రెడ్డి స్పందించారు. తక్షణమే బండిని బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలన్నారు. ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం అన్నారు. తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటన్నారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం చేసిందని వెల్లడించారు.
Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టుపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుందని మండిపడ్డారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని ఆరోపించారు. క్షుద్ర రాజకీయ క్రీడకు బీజేపీ తెరలేపిందని పేర్కొన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ లో పడొద్దని హితవు పలికారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీని గ్రామ గ్రామాన నిలదీయాలని పిలుపు ఇచ్చారు. యువత, విధ్యార్ధులను బీఆర్ఎస్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు.
ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మరోవైపు పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. రాజకీయ అవసరాల కోసం నిరుద్యోగులు, విద్యార్థులను వాడుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీ నేతలు రాజకీయంగా రాణించాలంటే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఓట్లు అడగాలని సవాల్ చేశారు. మంచి పనులు చేస్తే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎవరున్నా ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మళ్ళీ ఇలాంటి పనుల చేయాలంటే భయపడేలా కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.