Bandi Sanjay: ఈటల రాక పార్టీకి కలిసొస్తుంది.. బీజేపీ వైపు ఉద్యమ కారుల చూపు

ఈటల రాజేందర్ రాక బీజేపీ బాగానే కలిసొస్తుందట. ఈ మాటల స్వయంగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అంటున్నారు. ఈటల రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని

Bandi Sanjay

Bandi Sanjay: ఈటల రాజేందర్ రాక బీజేపీ బాగానే కలిసొస్తుందట. ఈ మాటల స్వయంగా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ అంటున్నారు. ఈటల రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని హుజూరాబాద్ బీజేపీ నేతలతో ఫోన్లో మాట్లాడుతూ అన్నారు.

పార్టీలోకి బండి సంజయ్ తో పాటు మరో ముఖ్య నేత రాబోతున్నట్లుగా సమాచారం ఇచ్చారు. అదే సమయంలో ఉద్యమకారుల చూపంతా బీజేపీ వైపే ఉందని అన్నారు. ఈ విషయాన్ని భారీ బహిరంగ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. కొవిడ్ తీవ్రత తగ్గిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నట్లు సమాచారం.

పార్టీ ప్రెసిడెంట్ ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అందుకున్న హుజూరాబాద్ బీజేపీ నేతలు నిర్ణయాన్ని స్వాగతించారు.

Read:Etela Rajender : టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. బతికుండగానే బొందపెట్టాలనుకున్నారు