ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా.. ఓ కూతురు క్రైమ్ స్టోరీ.. అంతకు ముందు ఓ లవ్ స్టోరీ..

వీరన్న అనే యువకుడిని ఐదేళ్ల క్రితం సంగీత ప్రేమించింది. దీంతో వారి ప్రేమను ఒప్పుకుని ఇద్దరికీ లక్ష్మి పెళ్లి చేసింది. అయినప్పటికీ..

ఆస్తి కోసం కన్నతల్లిని దారుణంగా.. ఓ కూతురు క్రైమ్ స్టోరీ.. అంతకు ముందు ఓ లవ్ స్టోరీ..

Updated On : September 11, 2025 / 10:07 AM IST

Jangaon: కన్నతల్లి అని కూడా చూడకుండా ఆస్తి కోసం ఆమెను హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది. కొండాపురం పెద్ద తండా(కె) గ్రామంలో బాదావత్ లక్ష్మి(45) నివసించేది.

ఆమె భర్త 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. ఆమెకు సంగీత అనే కూతురు ఉంది. ఎన్నో బాధలు పడుతూ వ్యవసాయం పనులు చేస్తూ సంగీతను అల్లారుముద్దుగా పెంచింది లక్ష్మి.

భూక్య వీరన్న అనే యువకుడిని ఐదేళ్ల క్రితం సంగీత ప్రేమించింది. దీంతో వారి ప్రేమను కూడా ఒప్పుకుని ఇద్దరికీ లక్ష్మి పెళ్లి చేసింది. తన మూడెకరాల 10 గుంటల భూమిలో 2 ఎకరాల భూమిని అమ్మి కట్నంగా ఇచ్చింది.

అంతేకాదు, ఆడపడుచులకు సైతం 20 గుంటలు ఇచ్చింది. మిగిలిన 30 గుంటల భూమిని తన పేరుపై ఉంచుకుని ఒంటరిగా కూలీ పనులు చేసుకుంటూ బతుకుతోంది.

లక్ష్మి పేరిట ఉన్న భూమి కూడా తమకే కావాలంటూ సంగీత, వీరన్న కొంత కాలంగా గొడవలకు దిగుతున్నారు. అయితే, తాను జీవించి ఉన్నంతకాలం ఆ భూమిని ఇవ్వబోనని లక్ష్మి చెప్పింది. లక్ష్మి చనిపోతే ఆ భూమి తమకే దక్కుతుందని భావించిన సంగీత, వీరన్న సెప్టెంబర్ న అర్ధరాత్రి లక్ష్మి నిద్రిస్తుండగా ముఖంపై దిండుతో అదిమి చంపేశారు.

ఉదయం లక్ష్మి ఇంటికి వెళ్లిన స్థానికులు ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, సంగీత, వీరన్నను అరెస్టు చేశారు.

మరోవైపు, ఆస్తి కోసం వదినను చంపేశాడు ఓ వ్యక్తి. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా సాలూర మండల కేంద్రంలో ఈ దారుణం చోటుచేసుకుంది. నాగవ్వ (65) భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు.

ఆమెకు పిల్లలు లేరు. లేకపోవడంతో మరిది కుటుంబంతోపాటు ఉంటోంది. నాగవ్వను హత్య చేస్తే ఆమె వద్ద ఉన్న బంగారంతో పాటు డబ్బులు కూడా తీసుకోవచ్చని ఆమె మరిది చిన్న గంగారాం, అతడి భార్య కళావతి, వారి కుమారుడు గణేశ్ ప్లాన్ వేశారు. రాత్రి సమయంలో లక్ష్మిని గొంతు నులిమి చంపారు.