Bandi Sanjay: అమ్మవారి కృపతో కేసీఆర్ ఆయురారోగ్యంతో ఉండాలి – బండి సంజయ్

సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా బాగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

Bandi Sanjay

Bandi Sanjay: సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉండటంతో యశోదా హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండ్రోజులుగా బాగా నీరసంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఎడమ చేయి, ఎడమ కాలు లాగుతున్నాయని వైద్యులు చెప్పడంతో షుగర్, బీపీ, యాంజోగ్రామ్, సిటీ స్కాన్ వైద్య పరీక్షలు నిర్వహించారు.

ప్రస్తుతం నిలకడగానే ఉందని, మరికొన్ని వైద్య పరీక్షల ఫలితాలు వస్తేనే క్లారిటీ ఉంటుందని వైద్యులు కన్ఫామ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ తాను ఆందోళనకు గురయ్యానని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి అనారోగ్య సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ లో పేర్కొన్నారు.