యుద్ధం మొదలైంది.. ఎన్నికల తర్వాత సీపీ, టీఆర్ఎస్ కార్యకర్తల సంగతి చూస్తాం

  • Publish Date - October 29, 2020 / 03:22 PM IST

bandi sanjay warns: బ్బాక ఉప ఎన్నికల ప్రచారం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాసులాబాద్ లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. అధికార పార్టీపై ఆయన ఫైర్ అయ్యారు.

దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి మానసిక క్షోభతో చనిపోయారని బండి సంజయ్ అన్నారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు. సిద్ధిపేట సీపీ జోయల్ డేవిస్, టీఆర్ఎస్ కార్యకర్తల సంగతి ఎన్నికల తర్వాత చెబుతామని బండి సంజయ్ హెచ్చరించారు. దుబ్బాక నుంచే యుద్ధం మొదలైందని ఆయన అన్నారు.