Bandi Sanjay : బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదిద్దాం, మీ పోరాటాలను కొనసాగించండీ : బండి సంజయ్‌కు అధిష్టానం భరోసా

బీఆర్ఎస్ కుట్రల్ని ఛేదిద్దాం..ప్రజాసమస్యలపై, మీ పోరాటాలను కొనసాగించండీ అంటూ జైలు నుంచి విడుదల అయిన బండి సంజయ్ కు అధిష్టానం భరోసా ఇచ్చింది.

Bandi Sanjay : 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండిసంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదల అయ్యారు. విడుదల అయిన బండి సంజయ్ కు మీకు మేం అండగా ఉంటాం..ఏం మాత్రం భయపడవద్దు అంటూ బీజీపీ అధిష్టానం భరోసా ఇచ్చింది. జాతీయ నాయకత్వం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు కేంద్ర నాయకులు బండి సంజయ్ కు ఫోన్ చేశారు. అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, స్మృతీ ఇరానీ, తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్ వంటి నేతలు ఫోన్ లో బండిని పరామర్శించారు.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేవారికి ఇటువంటి ఇబ్బందులు తప్పవని కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తారని కానీ బీజేపీ నేతలు గానీ ,కార్యకర్తలు గానీ ఇటువంటి బెదిరింపులకు బెదరరు అని అధిష్టానం ఈ సందర్బంగా వెల్లడించింది. ప్రజా సమస్యలపై మీ పోరాటాలను కొనసాగించండీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే కుట్రలను ఛేదిద్దాం అంటూ భరోసా ఇచ్చారు.

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ లీకేజీని పక్కదారి పట్టించేందుకే ఈ కుట్రలు.. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్

కరీంనగర్ జైలునుంచి విడుదల అయిన బండి సంజయ్ కుటుంబ సభ్యులను కలిసారు. అనంతరం ఈరోజు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో రేపు అంటే 8తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటనపై చర్చలు జరుపనున్నారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు హాజరై ప్రధాని పర్యటనతో పాటు తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు