Bandi Bhagirath: బెయిల్ ప్లీజ్.. హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

ఈ కేసులో నిష్పక్షపాత విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను విచారణ అధికారిగా నియమించింది ప్రభుత్వం.

  • Updated on- May 12, 2026 / 04:50 PM IST

Bandi Bhagirath: బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో వెకేషన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై ఈ నెల 14న వెకేషన్ బెంచ్ లో విచారణ జరగనుంది.

ఈ కేసులో నిష్పక్షపాత విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ను విచారణ అధికారిగా నియమించింది ప్రభుత్వం. బాధితురాలి స్టేట్ మెంట్ ను మరోసారి రికార్డ్ చేయబోతున్నారు. బండి భగీరథ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేశారు. బండి భగీరథ్ కేసుని నీరుగార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ సిట్ వేశారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. సిట్ వేయడంతోనే బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కు రాజకీయం బయటపడిందని హరీశ్ రావు అన్నారు.

తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు వస్తున్న ఈ తరుణంలో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బండి భగీరథ్ అందుబాటులో లేడని, అతడి ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో భగీరథ్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్ పై పోక్సో కేసు నమోదు చేశారు. అటు భగీరథ్ పై కేసు పెట్టిన బాధితురాలిపై కరీంనగర్ లో హనీ ట్రాప్ కేసు నమోదైంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ అనంతరం హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువరించనుంది అనేది ఉత్కంఠగా మారింది. కోర్టు మధ్యంతర బెయిల్ ఇస్తుందా లేక సిట్ విచారణకు సహకరించాలని కోరుతుందా అనేది చూడాలి.

Also Read: ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇలా చేయాలి.. లేదంటే నో అడ్మీషన్..