Telangana Inter Admissions 2026 : ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా ఇలా చేయాలి.. లేదంటే నో అడ్మీషన్..
Telangana Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్ అడ్మిషన్లు మొదటి విడతను మంగళవారం నుంచి ప్రారంభించనుంది.
Inter admissions
- తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్
- నేటి నుంచి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
- జూన్ 1 నుంచి తరగతులు
- డ్రగ్స్ వ్యతిరేక అఫిడవిట్ ఇవ్వాల్సిందే
Telangana Inter Admissions 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి ఫస్ట్ ఇయర్ ఇంటర్ అడ్మిషన్లు మొదటి విడతను మంగళవారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, రెసిడెన్షియల్, మైనారిటీ, వోకేషనల్ జూనియర్ కాలేజీల్లో సీట్లు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు సమర్పించడానికి ఈనెల 31న చివరి తేదీగా ప్రకటించింది. జూన్ 1వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి. మొదటి విడత అడ్మిషన్లు జూన్ 30తో ముగియనున్నాయి.
Also Read : West bengal BJP Government : మొదటిసారి గెలవగానే బెంగాల్ మహిళకు బీజేపీ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్..
మంగళవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంకు సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తమ పదో తరగతి ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా తాత్కాలిక ప్రవేశాలు పొందొచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించిన తరువాతే వీటిని అధికారులు ఖరారు చేస్తారు. అయితే, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇంటర్మీడియట్ బోర్డు కాలేజీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అడ్మిషన్ల కోసం కళాశాలలు ఎలాంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని, కేవలం జీపీఏ, సబ్జెక్టుల వారీ గ్రేడ్ పాయింట్ల ఆధారంగానే సీట్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు కాలేజీల యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని బోర్డు అధికారులు హెచ్చరించారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలల్లో ప్రవేశానికి రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఎస్సీ 15శాతం, ఎస్టీ 10శాతం, బీసీ 29శాతం, ఈడబ్ల్యూఎస్ 10శాతం ఉంటాయి. అంతేకాక.. దివ్యాంగులు 5శాతం, ఎన్సీసీ అండ్ క్రీడలు 5శాతం, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు 3శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ ప్రకారంగానే అడ్మిషన్లు జరుగుతాయి. కో- ఎడ్యుకేషన్ కళాశాలల్లో బాలికలకు 33.33 శాతం సీట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ లో అడ్మిషన్లు పొందేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రభుత్వం కొత్త నిబంధన పెట్టింది. అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థి ఆధార్ నంబర్ సమర్పించాల్సి ఉంటుంది. అదేవిధంగా అడ్మిషన్ల సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా యాంటీ-డ్రగ్ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందని ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది.
ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కళాశాలలు ప్రతి సెక్షన్ కు గరిష్ఠంగా 88మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలని, ఖాళీల వివరాలను ప్రతిరోజూ నోటీసు బోర్డులో ప్రదర్శించాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్యార్థులు లేదంటే ఓసీఐ కార్డు ఉన్నవారు ప్రవేశం పొందితే, ఆ సమాచారాన్ని 24గంటల్లోపు సంబంధిత పోలీస్ స్టేషన్లో నివేదించాలని పేర్కొంది. జోగిని వ్యవస్థ బాధితల పిల్లల విషయంలో తండ్రి పేరుకు బదులుగా తల్లిపేరును రికార్డురల్లో నమోదు చేయాలని కాలేజీ యాజమాన్యాలకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
