Bandla Ganesh: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీపై క్లారిటీ ఇచ్చిన బండ్ల గణేశ్.. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

త్వరలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని ..

Bandla Ganesh

Telangana Congress Party: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఈసీ కసరత్తు చేస్తోంది. దీంతో అధికార బీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు త్వరలో అభ్యర్థులను ప్రకటించేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సినీ నిర్మాత బండ్ల గణేశ్ బరిలోకి దిగబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ అంశంపై బండ్ల గణేశ్ స్వయంగా ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Read Also : Vangaveeti Radha Marriage: వంగవీటి రాధా వివాహానికి ముహూర్తం ఫిక్స్.. వెడ్డింగ్ కార్డ్ వైరల్ .. వివాహం ఎప్పుడంటే?

త్వరలో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నిర్మాత బండ్ల గణేశ్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి బండ్ల గణేశ్ ను బరిలోకి దింపుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై బండ్ల గణేశ్ ట్విటర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.

Read Also : Atchannaidu : ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబుపై అక్రమ కేసు : అచ్చెన్నాయుడు

గణేశ్ ట్వీట్ ప్రకారం.. ‘నేను ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను. రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ, నాకు ఈసారి టికెట్ వద్దు. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి. నేను టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం, అదికారంలోకి వస్తాం. జై కాంగ్రెస్’. అంటూ బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. దీంతో కొద్దికాలంగా బండ్ల గణేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్లయింది.

 

ట్రెండింగ్ వార్తలు