IND vs BAN : టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ సెష‌న్‌లో ఎలా కష్టపడుతున్నారో చూశారా.. వీడియో వైరల్

TeamIndia Practice Session

Teamindia Players Practices: ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం (సెప్టెంబర్ 19) నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. రెండు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో గురువారం నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల ఆటగాళ్లు ఇప్పటికే చెన్నైకు చేరుకున్నారు. తొలి టెస్టు నేపథ్యంలో టీమిండియా ప్లేయర్స్ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సోమవారం చెపాక్ స్టేడియంలో 16 మంది ఆటగాళ్లు ప్రాక్టీస్ లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read : IND vs BAN : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు.. అందుకుంటాడా?

నెట్స్ లో అడుగుపెట్టిన వాళ్లలో కోహ్లీ కూడా ఉన్నారు. కోహ్లీ, యశస్వీ జైస్వాల్ లు బుమ్రా, అశ్విన్ బౌలింగ్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, సర్పరాజ్ ఖాన్ ప్రాక్టీస్ చేశారు. బంగ్లాదేశ్ స్లో బౌలింగ్ ఎటాక్ ను దృష్టిలో పెట్టుకొని రోహిత్ శర్మ స్పిన్ బౌలింగ్ ను ఎక్కువ సేపు ప్రాక్టీస్ చేశాడు. అయితే, ప్రాక్టీస్ సమయంలో టీం సభ్యులు రెండు జట్లుగా విడిపోయి క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు. ఇందులో విరాట్ కోహ్లీ జట్టు విజయం సాధించింది. బీసీసీఐ షేర్ చేసిన వీడియోలో టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ మాట్లాడుతూ.. టీమిండియా ప్లేయర్లు రెండు జట్లుగా విడిపోయి క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు. కోహ్లీ టీం విజేతగా నిలిచిందని తెలిపారు. మొత్తం మీద ఇది ఒక అద్బుతమైన సెషన్ అని అన్నారు.