Telangana : మద్యం ప్రియులకు అలర్ట్.. తెలంగాణ వ్యాప్తంగా బార్లు బంద్! కారణమిదే?
Telangana Bar and Restaurant Owners Protest : తెలంగాణలోని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేయబోతున్నట్టుగా అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు.
- Harish Thanniru
- Published on- October 4, 2026 / 01:48 PM IST
Telangana Bar and Restaurants
Telangana Bar and Restaurant Owners Protest : తెలంగాణలోని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేయబోతున్నట్టుగా అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ ఫీజు (సెస్)తో తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read : Are You Buying Gold : బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే, ఈ విషయాలు తెలుసుకోండి.. లేదంటే మోసపోయినట్లే..!
తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. అలాగే 5వ తేదీన అప్కారీ శాఖ ఆఫీస్‌ను ముట్టడించబోతున్నట్టు తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
తెలంగాణ సర్కార్ ప్రివిలెజ్ సెస్ పేరిట యేటా ఒక్కో బార్ నుంచి 8 శాతం నుంచి 20శాతం వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రతియేటా సుమారు 30లక్షల రూపాయల వరకు అదనంగా బార్లపై భారం పడుతుందని బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే వైన్స్‌లో పర్మినెంట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడం.. దీనికితోడు బెల్ట్ షాపులతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ని కష్టాలు వెంటాడుతున్నా.. బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు పేరుతో ప్రతిఏటా ప్రభుత్వానికి 33 లక్షల నుంచి 56 లక్షల రూపాయలు చెల్లిస్తున్నామని, ఇప్పుడు ఇది చాలదని ప్రివిలెజ్ సెస్ పేరుతో అధనంగా 30లక్షల రూపాయల వరకు భారం పడుతుందని బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ గౌడ్ తెలిపారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని అన్నారు.
ఇదిలాఉంటే.. బంద్‌కు పిలుపునివ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,200లకుపైగా బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చే వరకు బంద్ కొనసాగుతుందని, డిమాండ్లు నెరవేరకపోతే నిరాహార దీక్షలతో పాటు భవిష్యత్తులో మరింత ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు.
