Basara IIIT: యూనివర్సిటీకి సెలవులే విద్యార్థులకు సమాధానమా!

రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు.

Basara IIIT: రోజుల తరబడి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కొనసాగుతూనే ఉంది. కాలేజీ యాజమాన్యం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినప్పటికీ కేటీఆర్, కేసీఆర్ లలో ఎవరో ఒకరు వచ్చేవరకూ దీక్ష విరమించమని విద్యార్థులు మొండిపట్టుతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జాగరణ దీక్ష చేపట్టారు. యూనివర్సిటీకి సెలవులు ప్రకటించి దీక్ష భగ్నం చేయొద్దని, శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామంటూ విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

దీక్షను విరమించి సోమవారం నుంచి క్లాసులకు అటెండ్ కావాలంటూ 18 నిమిషాల పాటు విద్యార్థులతో మాట్లాడిన డైరక్టర్ సతీష్ కుమార్ మాట్లాడారు. వీటన్నిటినీ ఇన్ స్టాలో లైవ్ పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండగా.. ఫోన్ రికార్డ్‌లను ఆపాలని హెచ్చరికలు జారీ చేశారు.

డిమాండ్లు పరిష్కారిస్తామంటే అర్థం కావడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన డైరక్టర్.. ఉదయం నుండి క్లాసులకు హాజరు కావాల్సిందేనని హెచ్చరించారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. జాగరణ దీక్ష విరమించమంటూ విద్యార్థులు తెగేసి చెప్పారు.

Read Also : బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ ఆడియో కలకలం

హామీ పత్రం ఇచ్చినప్పుడే మాట్లాడండి అంటూ ఉన్నతాదికారులకు విద్యార్థుల ధీటుగా సమాదానమిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు