Bathukamma Sarees : ముందస్తుగా బతుకమ్మ ఆర్డర్లు.. 200 డిజైన్లు, 10 రంగులు

బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది.

Bathukamma Sarees To Be Distributed By Telangana Govt

Bathukamma Sarees 2022 : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చే చీరల విషయంలో ఇప్పటి నుంచే దృష్టి సారించింది. ఈసారి ప్రత్యేకంగా చీరలను ఇవ్వాలని భావిస్తోంది. సిరిసిల్ల నేతన్నలకు ఈ సంవత్సరం ముందుగానే బతుకమ్మ చీరల ఆర్డర్లు అందుకోనున్నారు. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రణాళికను ఖరారు చేసింది.

Read More : IND vs WI: భారత్, వెస్టిండీస్ మూడో ODI.. రెండు జట్లలో Probable XI వీళ్లే!

ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను 200 డిజైన్లలో, 10 రంగుల్లో తయారు చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు చీరలు ఉత్పత్తి చేయాలంటూ మరమగ్గాల యజమానులకు ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చింది. వచ్చే ఆగస్టు నాటికి ఉత్పత్తి లక్ష్యాన్ని పూర్తి చేయాలని నిర్దేశించింది. గతంలో ఉన్న బంగారు వర్ణం నూలు స్థానంలో ఈ సారి రంగుల నూలుతో డిజైన్లను రూపొందించారు.

Read More : Telangana : సీఎం కేసీఆర్ జిల్లాల బాట.. జనగామలో బహిరంగసభ

సిరిసిల్ల పరిశ్రమలోని 271 మ్యాక్స్‌, ఎస్‌ఎస్‌ఐ యూనిట్ల యజమానులు బుధవారం నుంచి వస్త్రోత్పత్తి ఆర్డర్లు తీసుకుంటున్నారు. అధికారులు ఈ ఏడాది సిరిసిల్లకు 4.48 కోట్ల మీటర్లు, కరీంనగర్‌లోని గర్షకుర్తికి 14 లక్షలు, హనుమకొండకు 6.31 లక్షలు, వరంగల్‌కు 93 వేలు, మండేపల్లి టెక్స్‌టైల్‌ పార్కుకు 24 లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తికి ఆర్డర్లు కేటాయించారు. రాష్ట్రంలో ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం 5 కోట్ల మీటర్ల వస్త్రం అవసరమని అంచనా వేశారు. మరో వారం, పది రోజుల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాల కంటే ముందే చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.