Saree Bathukamma
Bathukamma Sarees : తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 6 నుంచి బతుకమ్మ సందడి మొదలుకానుంది. రెండో తేదీ నుంచి చీరల పంపిణీని ప్రారంభించనుంది ప్రభుత్వం. యువతులు, మహిళలు అందరికీ పండుగ కానుకగా కోటి చీరలను పంపిణీ చేయనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ చేసింది అధికారయంత్రాంగం. చేనేత కార్మికులకు చేయూత నివ్వాలనే ఆలోచనతో బతుకమ్మ పండుగకు చీరలను అందిస్తోంది ప్రభుత్వం. బతుకమ్మ చీరలతో మూడు నెలలుగా చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
Read More : CWC Meeting : సోనియా గ్రీన్‌సిగ్నల్..త్వరలోనే సీడబ్యూసీ భేటీ
సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్ జిల్లాలో మరమగ్గాలపై తయారు అయిన చీరలను రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది చాలా ఎక్కువ డిజైన్లను రూపొందించామన్నారు టెస్కో అధికారులు. మరమగ్గాలపై తయారైన చీరలను వాష్ చేసి, నీట్‌గా ప్యాకింగ్ చేసి జిల్లా కేంద్రాలకు పంపిస్తోంది టెస్కో సిబ్బంది. కోటి చీరల్లో ఇప్పటికే 90 శాతం చీరలు..జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు అధికారులు.
Read More : Mumbai Ex-Top Cop : రష్యాకి పారిపోయిన పరమ్ బీర్ సింగ్!
బతుకమ్మ సందర్భంగా..నాలుగేళ్లుగా నేత చీరలను పంపిణీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..ఈ సారి 30 కొత్త డిజైన్లలతో చీరలకు ఆర్డర్ ఇచ్చింది. వెండి, బంగారు రంగు జరీలతో పాటు డాబి, జాకాడ్ అంచుల డిజైన్లతో చీరలు అందిస్తామన్నారు జౌళిశాఖ ఎండీ శైలజా రామయ్యర్. అక్టోబర్ మొదటివారంలో బతుకమ్మ చీరలను పూర్తి స్థాయిలో పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేశారు టెస్కో అధికారులు. చీరల పంపిణీ వివరాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు అందించామన్నారు. గ్రామస్థాయిలో పంపిణీకి సంబంధించి అధికారులకు సూచనలు చేస్తున్నారు.