CWC Meeting : G-23 ఎఫెక్ట్..త్వరలో సీడబ్యూసీ భేటీ!

త్వరలోనే సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)సమావేశం జరగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా  తెలిపారు.

CWC Meeting : G-23 ఎఫెక్ట్..త్వరలో సీడబ్యూసీ భేటీ!

Congress (3)

CWC Meeting త్వరలోనే సీడబ్ల్యూసీ(కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ)సమావేశం జరగుతుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా  తెలిపారు. పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం నేపథ్యంలో పార్టీలో సంస్కరణలపై అసంతృప్త సీనియర్ నేతలు సీడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు చేయాలని అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.  దీనిపై సీనియర్ నేత కపిల్ సిబల్ రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడారు. అధ్యక్ష పదవితో పాటు సీడబ్ల్యూసీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎన్నికలపై అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీలో సంస్థాగత సంస్కరణలను కోరుతూ గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ హైకమాండ్ కి లేఖ రాసిన 23మంది కాంగ్రెస్ నేతలు(జీ 23 గ్రూప్)ల్లో కపిల్ సిబల్ ఒకరు. సీడబ్యూసీ మీటింగ్ ఏర్పాటు చేయాలని..దీని వల్ల కాంగ్రెస్ ఈ స్థితిలో ఎందుకు ఉన్నది అనే దానిపై ఒక సంభాషణ జరుగుతుంది అని కపిల్ సిబల్ అన్నారు.

ఇక, CWC అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్(జీ-23 గ్రూప్ లో ఒకరు) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే ఒక లేఖ రాసిన నేపథ్యంలో త్వరలోనే సీడబ్యూసీ సమావేశం జరగనుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా తెలిపారు. సిమ్లాకు బయల్దేరే ముందే సోనియా సీడబ్ల్యూసీ భేటీపై సంకేతాలు ఇచ్చారని.. త్వరలోనే భేటీ జరుగుతుందని చెప్పారు.

ALSO READ కాంగ్రెస్ లో అధ్యక్షుడే లేరు..పంజాబ్ పరిణమాలు పాక్ కి లాభం..సోనియాకి ఆజాద్ లేఖ