Kapil Sibal : కాంగ్రెస్ లో అధ్యక్షుడే లేరు..పంజాబ్ పరిణమాలు పాక్ కి లాభం..సోనియాకి ఆజాద్ లేఖ

కాంగ్రెస్ లో అధ్యక్ష లేమి అంశాన్ని మరోసారి తెరమీదకి తెచ్చారు మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత కపిల్ సిబల్. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు

Kapil Sibal : కాంగ్రెస్ లో అధ్యక్షుడే లేరు..పంజాబ్ పరిణమాలు పాక్ కి లాభం..సోనియాకి ఆజాద్ లేఖ

Kapil

Kapil Sibal కాంగ్రెస్ లో అధ్యక్ష లేమి అంశాన్ని మరోసారి తెరమీదకి తెచ్చారు మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నేత కపిల్ సిబల్. పంజాబ్ లో అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బుధవారం కపిల్ సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పార్టీలో సంస్థాగత సంస్కరణలను కోరుతూ గతేడాది ఆగస్టులో కాంగ్రెస్ హైకమాండ్ కి లేఖ రాసిన 23మంది కాంగ్రెస్ నేతలు(జీ-23 గ్రూప్)తరపున తాను మీడియాతో మాట్లాడుతున్నానన్న కపిల్ సిబల్..నూతన అధ్యక్షుడి ఎంపిక, కార్యాలయ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకత్వం తీసుకునే చర్యల గురించి ఎదురుచూస్తున్నామన్నారు. పార్టీలో(కాంగ్రెస్) ప్రస్తుతం ఎన్నుకున్న అధ్యక్షుడు ఎవరూ లేరు కాబట్టి ఎవరు ఈ నిర్ణయాలు తీసుకుంటారో మాకు తెలియదన్నారు.

పంజాబ్ సహా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రస్తుతం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీడబ్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రెసిడెంట్ కి తన సహోద్యోగులలో ఎవరో ఒకరు లేఖ రాసి ఉండవచ్చునని..ఒకవేళ రాయకుంటే ఇప్పుడు రాస్తారని తాను నమ్ముతున్నానన్నారు. సీడబ్యూసీ మీటింగ్ ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ఈ స్థితిలో ఎందుకు ఉన్నది అనే దానిపై ఒక సంభాషణ జరుగుతుంది అని కపిల్ సిబల్ అన్నారు. కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్(జీ-23 గ్రూప్ లో ఒకరు) కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇప్పటికే ఒక లేఖ రాసినట్లు సమాచారం.

ఇక,పంజాబ్ పరిణామాలు ISI పాకిస్తాన్‌కు ప్రయోజనం కలిగేలా ఉన్నాయని కపిల్ సిబల్ అన్నారు. పంజాబ్ చరిత్ర మరియు అక్కడ తీవ్రవాదం పెరగడం తమకు తెలుసునని …పంజాబ్ లో కాంగ్రెస్ నేతలు ఐక్యంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నారు.

ALSO READ పాక్ ఆర్మీ,ఐఎస్ఐ ట్రైనింగ్ ఇచ్చింది..కీలక విషయాలు బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది
తాము (G-23 నాయకులు) పార్టీని విడిచిపెట్టి, మరెక్కడికీ వెళ్లే వారిమి కాదని అన్నారు. పార్టీ నాయకత్వానికి సన్నిహితంగా ఉన్నవారు వెళ్లిపోయారు.. వారికి(పార్టీ నాయకత్వానికి) సన్నిహితులుగా భావించని వారు ఇప్పటికీ వారితోనే ఉన్నారని కపిల్ సిబల్ తెలిపారు. పార్టీని ఎలా బలోపేతం చేయవచ్చో దేశంలోని ప్రతి కాంగ్రెస్ వాది ఆలోచించాలన్నారు. వెళ్లిపోయిన వారు తిరిగి రావాలన్నారు. కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలదని అన్నారు. తాము “జీ హుజూర్ 23″కాదని కపిల్ సిబల్ సృష్టం చేశారు. తాము మాట్లాడుతూనే ఉంటామన్నారు. తమ డిమాండ్లను పునరుద్ఘాటిస్తూనే ఉంటామన్నారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ పంజాబ్ లో అమరీందర్ సింగ్ ను సీఎంగా తప్పించి చరణ్ జీత్ సింగ్ చన్నీని సీఎంగా ఎంపిక చేసిన కొద్దిరోజులకే పీసీసీ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో కపిల్ సిబల్ తాజా వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ALSO READ రెండేళ్ల ప్రేమ.. ప్రియుడి మాటకు మనస్తాపం చెంది యువతి ఆత్మహత్య