×
Ad

BC Reservation : బీసీ రిజర్వేషన్ల అంశం.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం పిటిషన్‌ను కోర్టు ..

Supreme Court

BC Reservation : బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీఓ 9పై హైకోర్టు విధించిన స్టేను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్‌పీ)పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించామని, డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్వహించుకోవచ్చని ఇందిరా సహానీ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు.

Also Read: Konda Surekha OSD : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న సుమంత్ పేరు.. ఎవరీ సుమంత్? ఏంటీ అసలు గొడవ?.. ఫుల్ డిటెయిల్స్

50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడ లేదు.. 50శాతం రిజర్వేషన్లు మించకూడదని సుప్రీంకోర్టు కూడా ఎక్కడ చెప్పలేదని అన్నారు.

పాత రిజర్వేషన్ల రేషియో ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బీసీ 25శాతం, ఎస్సీ 15శాతం, ఎస్టీ 10శాతం ఉన్నట్లు ప్రతివాదుల న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఆర్డినెన్స్ తో పాటు బిల్లు రెండు నోటిఫై కాలేదని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. తమ ఆదేశాలతో సంబంధం లేకుండా తదుపరి విచారణ చేపట్టాలని.. మెరిట్స్ ప్రకారం విచారించాలని హైకోర్టుకు సూచించింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్ల ఆధారంగా స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చునని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది.