Beware of rain and floods : హైదరాబాద్ ను ప్రకృతి పగబడినట్లే ఉంది. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే జలమయమయ్యే…హైదరాబాద్..లో ఏకంగా..రెండు రోజు పాటు భారీ వర్షం కురవడంతో వరద నీరు పోటెత్తింది. ఎక్కడికక్కడ కాలనీలు నీట మునిగాయి. మరలా 2020, అక్టోబర్ 17వ తేదీ శనివారం సాయంత్రం నుంచి 8 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది.
ఇప్పుడే కోలుకుంటామని అనుకున్న కాలనీల ప్రజల కన్నీళ్లు మరింత ఎక్కువయ్యాయి. చుట్టూ చూసినా నీళ్లే..కానీ తాగడానికి నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోకి నీరు రావడంతో నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో ఆకలికి అల్లాడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
వారికి ఆహారం, మంచినీటిని అందిస్తోంది. పలు స్వచ్చంద సంస్థలు ఆకలిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో…అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రధానంగా..తాగునీటి విషయంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు సూచించారు. ఎలాంటి కలుషితం లేని నీటిని సప్లై అవడానికి చర్యలు తీసుకుంటున్నామని, కానీ..కాచి వడపోసిన నీళ్లనే వాడాలని వెల్లడిస్తోంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే…వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. సో..కాచి వడబోసిన నీటిని వాడడం బెటర్.