Telangana : పొలం దున్నుతుంటే బైటపడ్డ రాతికాలంనాటి సమాధులు..రాతి చిప్పలు

చరిత్ర భూమి పొరల్లో కనిపిస్తుంది అనే మాట ఎన్నో తవ్వకాల్లో బయటపడింది. ఈక్రమంలో తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ రైతు పొలం దున్నతుంటే రాతికాలం నాటి ఆనవాళ్లు బైటపడ్డాయి. రాతియుగం నాటి చిప్పలు, సమాధులు, కుండలు,నీటి తొట్టెలు బైటపడ్డాయి.

Stone Age Pots,tombs Unearthed

Stone Age pots,tombs unearthed : చరిత్ర భూమి పొరల్లో కనిపిస్తుంది అనే మాట ఎన్నో తవ్వకాల్లో బయటపడింది. రాతి యుగము లేదా శిలా యుగము అయిన చెప్పుకునే కాలంనాటి ఆనవాళ్లు ఎన్నో ప్రాంతాల్లో పరిశోధకులు జరిపే తవ్వకాల్లో బైటపడుతుంటాయి. ఈక్రమంలో తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ రైతు పొలం దున్నతుంటే రాతికాలం నాటి ఆనవాళ్లు బైటపడ్డాయి. రాతియుగం నాటి చిప్పలు, సమాధులు, కుండలు,నీటి తొట్టెలు బైటపడ్డాయి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోలోని ఆళ్లపల్లి మండలం జిన్నెలగూడెంలో ఓ రైతు పొలం దున్నతుంటే రాతి యుగంనాటి సమాధుల ఆనవాళ్లతోపాటు పలు రాతి చిప్పలు ఉన్నాయి. దీనిపై అధికారులకు సమాచారం అందించగా..వెంటనే అక్కడికి చేరుకున్న కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు వాటిని పరిశీలించగా..అవి రాతియుగం నాటివని తేలాయి.

రాతి చిప్పలతోపాటు పొలాల పక్కన పరుపురాతి బండలపై తొలిచిన నీటి తొట్టెలు కూడా ఉన్నట్టు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. నీటిని నిల్వ చేసుకునేందుకు ఆదిమానవులు ఈ తొట్టెలను ఉపయోగించి ఉంటారని..నీటిని తాగేందుకు ఈ రాతి చిప్పల్ని ఉపయోగించి ఉంటారని అంచనా వేశారు. వీటిపై పరిశోధనలు చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని తెలంగాణ వారసత్వ శాఖ అధికారిగా గతంలో పనిచేసిన భానుమూర్తి తెలిపారు.