Bharat Jodo Yatra: నారాయణ పేట జిల్లాలోని యలిగండ్ల నుంచి భారత్ జోడో యాత్ర షురూ

కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి ఆయన యాత్ర మొదలు పెట్టారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు భోజనం విరామం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో విరామం తీసుకుంటారు. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఇవాళ రాత్రి ఓబ్లాయిపల్లెలోని మన్యంకొండ దేవాలయంలో కార్నర్ సమావేశంలో పాల్గొంటారు.

Rahul Gandhi skips gujarat and himachal assembly elections

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మూడో రోజు ప్రారంభమైంది. నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం యలిగండ్ల నుంచి ఆయన యాత్ర మొదలు పెట్టారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు భోజనం విరామం అనంతరం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, గోప్లపూర్ కలాన్ లో విరామం తీసుకుంటారు. మళ్ళీ సాయంత్రం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది.

ఇవాళ రాత్రి ఓబ్లాయిపల్లెలోని మన్యంకొండ దేవాలయంలో కార్నర్ సమావేశంలో పాల్గొంటారు. రాయచూర్ రోడ్, ధర్మపూర్ లోని జేపీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద బసచేస్తారు. కాగా, నిన్న రాహుల్ గాంధీ పాదయాత్ర 26 కిలోమీటర్ల మేర కొనసాగింది. ఇందులో భాగంగా ఆయన రైతులు, కార్మికులతో మాట్లాడారు.

నిన్న పాదయాత్ర ముగిశాక ధన్వాడ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర సర్కారు అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. రాహుల్ పాదయాత్రలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..