Bullet Train: “శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్‌”పై రేవంత్‌ రెడ్డి కీలక సూచనలు

పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై తాజాగా అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి మాట్లాడారు.

Bullet Train: “శంషాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్‌”పై రేవంత్‌ రెడ్డి కీలక సూచనలు

Bullet Train

Updated On : September 12, 2025 / 12:48 PM IST

Bullet train: హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్ నుంచి తమిళనాడు రాజధాని చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చెప్పారు.

ఇప్పుడున్న రైల్వే లైన్‌తో పోల్చి చూస్తే కొత్త లైన్​తో దూరం తగ్గుతుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులతో పాటు ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై తాజాగా అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి మాట్లాడారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు తగ్గట్టుగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌-చెన్నై, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌-బెంగుళూరు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల సర్వేతో పాటు అలైన్​మెంట్ ప్రతిపాదనలను రైల్వే అధికారులు పరిశీలించాలని అన్నారు.

Vatsalya Scheme: ఏపీలో వారికి ప్రతి నెల రూ.4 వేలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. ఫుల్‌ డీటెయిల్స్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. అలాగే, దానికి తగ్గట్లు రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ మేరకు గ్రీన్​ ఫీల్డ్​ హైవే కోసం 300 కి.మీ అలైన్​మెంట్ ప్రతిపాదనలను సిద్ధం చేశామని తెలిపారు. కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. (Bullet train)

హైవే వెంట రైలుమార్గం ఉండాలని, రెండు వైపులా 1.5 కి.మీ దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్​ను విస్తరించాలని అన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు.

హైదరాబాద్ నుంచి అమరావతికి విభజన హామీల ప్రకారం.. ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్ర సర్కారు అమలు చేయాల్సి ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.